Site icon HashtagU Telugu

Techies Ride Tractors: బెంగళూరుకు వరద కష్టాలు.. ట్రాక్టర్లలో ఆఫీస్ లకు వెళ్తున్న టెకీలు!

Bengaluru

Bengaluru

భారీ వర్షాల తర్వాత బెంగళూరులో తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్నాయి. రోడ్లు, వీధులన్నీ జలమయంగా మారాయి. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు సిటీలో ఐటీ ఉద్యోగులు తమ తమ కార్యాలయాలకు చేరుకోవడానికి నరకయాతన పడుతున్నారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇస్తే, మరికొన్ని కంపెనీలు తమ ఆర్థిక వ్యవహరాలపై దెబ్బపడకుండా సెలవులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది ఐటీ ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. ఉద్యోగులు బైక్స్, కార్లకు బదులు ట్రాక్టర్లపై ప్రయాణం చేస్తున్నారు.

హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని యెమలూరు నీటమునిగడంతో సమీపంలోని ఐటీ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు ట్రాక్టర్లలో తమ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. “మేం మా ఆఫీసు నుండి సెలవులు తీసుకోలేం.  ఎందుకంటే వర్క్ పై ప్రభావం పడుతుంది. భారీ వరదలున్నా ఆఫీస్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేం ₹ 50 చెల్లించి ట్రాక్టర్ల లో ఐటీ కంపెనీలకు వెళ్తున్నాం’’ అని IT మహిళా ఉద్యోగిణి మీడియా కు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు వరద కష్టాలను తప్పించుకునేందుకు చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్తున్నారు. ఆ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు వరద కష్టాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే!

 

Exit mobile version