Biryani Vending Machine: దేశంలోనే ఫస్ట్ బిర్యానీ వెండింగ్ మెషీన్‌.. చెన్నై స్టార్టప్ సెన్సేషన్..

మనకు ఏటీఎం మిషన్ తెలుసు.. కానీ దేశంలోనే తొలిసారిగా చెన్నైలోని కొలత్తూర్ ప్రాంతంలో బాయ్ వీటూ కళ్యాణం (బీవీకే బిర్యాని) హోటల్ బిర్యానీ వెండింగ్ మెషీన్..

మనకు ఏటీఎం మిషన్ తెలుసు.. కానీ దేశంలోనే తొలిసారిగా చెన్నైలోని కొలత్తూర్ ప్రాంతంలో బాయ్ వీటూ కళ్యాణం (బీవీకే బిర్యాని) హోటల్ బిర్యానీ వెండింగ్ మెషీన్ (Biryani Vending Machine) ఏర్పాటు చేసింది. వెడ్డింగ్ స్టైల్ లో బిర్యానీ సర్వ్ చేయడం ఈ మెషీన్ స్పెషాలిటీ. అందుకే బాయ్ వీటూ కళ్యాణం అనే పేరు పెట్టారు. ఇది కస్టమర్ ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే తాజా బిర్యానీ మీకు ఇస్తుంది. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఎలాగైతే ఆప్షన్స్ ఎంచుకుంటామో.. అలాగే మీకు ఎటువంటి బిర్యానీ కావాలో స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని ఎంచుకుని డబ్బులు చెల్లించగానే బిర్యానీ ప్యాకెట్ బయటకి వచ్చేస్తుంది.

బిర్యానీ (Biryani) డెలివరీ ఇలా..

బిర్యానీ వెండింగ్ మెషీన్ (Biryani Vending Machine) సైజు 32 అంగుళాలు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వడానికి ముందుగా ఇది మెనూ చూపిస్తుంది. వినియోగదారుడు పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసుకోవచ్చు. ఇక్కడ మటన్ మినీ బిర్యానీ ధర రూ.345. డబ్బులు కట్టిన తర్వాత బిర్యానీ ప్యాకేజ్ ఆటోమేటెడ్ మెషీన్ కింద ఉన్న షెల్ఫ్ కిందకి వచ్చే ముందు స్క్రీన్ పై కౌంట్ డౌన్ టైమర్ పడుతుంది. అది ఇచ్చిన గడువు లోపు వేడి వేడి ఫ్రెష్ బిర్యానీ మీకు అందించేస్తుంది. భారత్ లోనే తొలి బిర్యానీ వెండింగ్ మెషీన్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది ఈ ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది మాత్రం బిర్యానీ నాణ్యత ఎలా ఉంటుందోనని సందేహిస్తున్నారు.

2020 సంవత్సరంలో..

చెన్నై నగరంలో 2020 సంవ త్సరంలో BVK బిర్యానీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చెన్నై అంతటా 60 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అందించే స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో 30 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని సదరు సంస్థ  చెబుతోంది.

Also Read:  SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?