ఒడిశా ప్రాంతంలోని చిలకా సరస్సుకు వచ్చే వలస పక్షుల సంఖ్య ఈ ఏడాది అనూహ్యంగా 15 తగ్గింది. గత ఏడాదితో పోల్చితే సుమారు 2 లక్షల పక్షులు తక్కువగా కనిపించడం గమనార్హం. అసాధారణమైన మంగోలియన్ గుల్ రకం పక్షుల అరుదైన దృశ్యం తో పాటు ఉప్పునీటి సరస్సు నలబానా పక్షుల అభయారణ్యం వద్ద గ్రేటర్ ఫ్లెమింగో వీక్షణల సంఖ్య పెరగడాన్ని అధ్యయనంలో గమనించారు.ఉప్పునీటి సరస్సులో వార్షిక పక్షుల గణనను బుధవారం చేపట్టారు. 183 విభిన్న జాతులకు చెందిన 10,74,173 వలస పక్షుల సంఖ్యను గుర్తించారు. అక్కడ ఈసారి దాదాపు 1,86,653 పక్షులు తగ్గాయి. గతంలో 190 జాతులకు చెందిన 12,42,826 పక్షులు కనిపించాయి. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS), వన్యప్రాణుల సంస్థ అధికారులు అనేక మంది పక్షి శాస్త్రవేత్తలు , వన్యప్రాణుల కార్యకర్తలు సుమారు 106 మంది లెక్కించిన తరువాత పక్షుల సంఖ్య తగ్గిందని. నిర్థారించారు.
మొత్తం పక్షుల గణన వాటర్‌బర్డ్ జాతులతో పాటు చిత్తడి నేలపై ఆధారపడిన పక్షుల కోసం నిర్వహించబడింది. ఇందులో పాసెరైన్ పక్షులు కూడా ఉన్నాయి. చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రస్ఫుటంగా కనిపించే పక్షుల కోసం వాస్తవ సంఖ్య గణన చేయబడింది. పెద్ద వాటిలో కనిపించే జాతుల కోసం కూడా అంచనా వేయబడింది. సరస్సు ప్రతి సంవత్సరం గరిష్ట చలి ఉన్నప్పుడు వలస పక్షులకు ఆతిథ్యం ఇస్తుంది. కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సముద్రం , రష్యా , ఆగ్నేయాసియా, మంగోలియాలోని కిర్గిజ్ స్టెప్పీలు వంటి ప్రాంతాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. ఆయా దేశాల్లోని స్థానిక ప్రదేశాలలో కనిష్టంగా పడిపోయిన చలి తప్పించుకోవడానికి చిలకా సరస్సుకు పక్షులు రావడం ప్రతి ఏడాది జరుగుతోంది. వేసవి కాలం ప్రారంభం అయిన తరువాత తిరిగి స్వస్థలాలకు పక్షులు వెళ్లిపోతుంటాయి. కానీ, ఈసారి మాత్రం 15శాతం పక్షుల తగ్గిపోవడాన్ని అధ్యయనం ద్వారా గుర్తించారు.

