Site icon HashtagU Telugu

Thiruvananthapuram Mayor : చంటిబిడ్డను మోస్తూ.. కార్యాలయ విధులు చేస్తూ.. మేయర్ ఫొటో వైరల్

Thiruvananthapuram Mayor

Thiruvananthapuram Mayor

Thiruvananthapuram Mayor : తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  సోమవారం రోజు తన నెల రోజుల పాపతో ఆమె ఆఫీసుకు వచ్చారు. ఆర్య రాజేంద్రన్ తన పాపతో ఆఫీసులో వర్క్ చేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె 2020 సంవత్సరంలో  21 ఏళ్ల ఏజ్ లోనే తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికై యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. మేయర్ గా ఎన్నికయ్యాక.. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆగస్టు 10న ఓ పాప పుట్టింది. ప్రసవం జరిగి నెలన్నర దాటిందో లేదో.. ఆర్య రాజేంద్రన్‌ తన పాపను ఎత్తుకొని ఆఫీసులో డ్యూటీకి వచ్చారు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

Also read : ANR Idol: రేపు అక్కినేని జయంతి, పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రంగం సిద్ధం!

ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని నెటిజన్స్ అన్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ ఇంకొందరు అభిప్రాయపడ్డారు. పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇంకొందరు డిమాండ్ చేశారు.  ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా అని పలువురు ప్రశ్నించారు. ఇవన్నీ ఫొటో షూట్ స్టంట్స్‌ అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. రోజువారి కూలీ పనులు చేసే వారు కూడా పిల్లల్ని పనిచేసే చోటుకు తీసుకెళ్తున్నారని ఇంకొందరు నెటిజన్స్ (Thiruvananthapuram Mayor)  అభిప్రాయపడ్డారు.