NEET Exam : నీట్ ప‌రీక్ష‌లో దారుణం.. అమ్మాయిల‌..?

నీట్ ప‌రీక్షా కేంద్రాల్లో అమ్మాయిలు దారుణ‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్

  • Written By:
  • Updated On - July 19, 2022 / 10:08 AM IST

నీట్ ప‌రీక్షా కేంద్రాల్లో అమ్మాయిలు దారుణ‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకు హాజరైన దాదాపు 90% మంది మహిళా అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్నారు. అయితే ప్రవేశించే ముందు తమ ఇన్నర్‌వేర్లను బలవంతంగా తీసివేయవలసి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లా అయూర్‌ పట్టణంలోని మార్థోమా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో చోటుచేసుకుంది. తన కుమార్తెపై అమానవీయంగా ప్రవర్తించిన తీరుపై విద్యార్థిని తల్లిదండ్రుల్లో ఒకరు కొల్లాం రూరల్‌ పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

తమ కుమార్తెను చెక్ చేస్తున్న స‌మ‌యంలో మెటల్ డిటెక్టర్‌కి బీప్ వచ్చిందని.. అందువల్ల ఆమె తన లోపలి దుస్తులను తీసివేయమని చెప్పారని త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. త‌న కూతురు నిరాకరించడంతో మానసికంగా వేధించారని తల్లిదండ్రులు తెలిపారు. తన కుమార్తె పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత, తాను, త‌న భార్య కారులో భోజనం చేసేందుకు వెళ్తుండ‌గా.. గేట్ వద్దకు రమ్మని కాలేజీ నుంచి ఫోన్ వ‌చ్చిందని వారు తెలిపారు. తాము గేటు వద్దకు చేరుకున్నప్పుడు, త‌మ కుమార్తె జ‌రిగిన ఘ‌ట‌న‌పై కన్నీళ్ల పెట్టుకుంద‌ని తెలిపారు.త‌మ కుమార్తె 3 గంటలపాటు సుదీర్ఘ పరీక్షకు ఇలా కూర్చోవాల్సిన బాధాకరమైన అనుభ‌వం ఎదురైంద‌ని..ఈ ఘ‌ట‌న నుంచి త‌మ కుమార్తె ఇంకా బ‌య‌టికి రాలేద‌న్నారు.

బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి మహిళా అధికారుల బృందం వెళ్లిందని, ఆమె చెప్పేదాని ఆధారంగా కేసు నమోదుతో సహా తగిన చర్యలు తీసుకుంటామని కొల్లాం జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రైవేట్ ఏజెన్సీని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు సోమవారం స్పందిస్తూ, ఈ పరీక్షను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీ నిర్వహించలేదని, నిర్వాహకుల ఘోర వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు.ఈ ఘటన నేపథ్యంలో సోమవారం కళాశాలకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మరోవైపు కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కొల్లం రూరల్ ఎస్పీని కమిషన్ ఆదేశించింది.