PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు.

  • Written By:
  • Updated On - March 31, 2024 / 01:13 PM IST

PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు. మన దేశంలోని తమిళనాడులో ఉండాల్సిన కచ్చతీవు  (బంజరు ద్వీపం) ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన పాపం కాంగ్రెస్‌దే అని ఆయన ఆరోపించారు.  జనావాసాలు లేని 285 ఎకరాల కచ్చతీవు  ద్వీపం  భూభాగాన్ని 1974లో శ్రీలంకకు అప్పగించాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా సేకరించిన సమాచారంతో ఈవిషయం వెలుగులోకి వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. కచ్చతీవు  ద్వీపాన్ని మన దేశం కోల్పోవడానికి ఆనాటి ఇందిరాగాంధీ సర్కారే కారణమన్నారు.

We’re now on WhatsApp. Click to Join

దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ మొగ్గుచూపిందని ప్రధాని మోడీ(PM Modi) విమర్శించారు. ‘‘భారత సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో  ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కచ్చతీవు ద్వీపం ఒకప్పుడు రామనాథపురం జమిందారీ సంస్థానంలో భాగంగా ఉండేది. 1822లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ద్వీపాన్ని రామస్వామి సేతుపతి నుంచి లీజుకు తీసుకుంది. చట్టపరమైన హక్కులను కలిగి  ఉన్నప్పటికీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఆనాడు అప్పగించడం దారుణం’’ అని ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయులందరి కళ్లు తెరిపించే వాస్తవాలు బయటికొచ్చాయి. దేశ భూభాగాన్ని ఎంత ఈజీగా కాంగ్రెస్ వదిలేసిందో వెల్లడైంది.  ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించే విషయం. ఇక కాంగ్రెస్‌ను నమ్మలేమనే భావనకు దేశ ప్రజలు వచ్చారు. 75 ఏళ్ల పాలనలో దేశానికి కాంగ్రెస్ చేసింది ఇదే’’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో కామెంట్ చేశారు.

Also Read :Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?

‘‘కచ్చతీవు లాంటి చిన్న ద్వీపానికి నేను అంతగా ప్రాముఖ్యతను ఇవ్వను. దాని హక్కులపై భారత్ తరఫు వాదనలను వదులుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’’ అని 1961 మే 10న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారనే విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై  ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో ఉంది. 

Also Read :Phone Tapping : ‘ఫోన్ ట్యాపింగ్’ దడ.. మీ ఫోన్ ట్యాప్ అయితే ఇలా గుర్తించండి

1983లో శ్రీలంకలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కచ్చతీవు   ద్వీపం భారతీయ తమిళ మత్స్యకారులు, సింహళ ఆధిపత్యమున్న లంక నౌకాదళం మధ్య పోరాటాలకు యుద్ధభూమిగా మారింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను అనుకోకుండా దాటినందుకు అప్పట్లో ఎంతోమంది భారతీయులను అరెస్టు చేసి జైళ్లలో వేశారు. అయితే ఈ  దీవిని భారత్‌కు లీజుకు ఇచ్చేలా శ్రీలంక ప్రభుత్వం చొరవ చూపాలంటూ అక్కడి సింహళీయ మత్స్యకారులు పలుమార్లు నిరసనకు దిగారు. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం చాలా క్లిష్టంగా మారిపోయింది.