Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి

బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 01:38 PM IST

Tamil Nadu: తమిళనాడులోని అరియలూరు జిల్లా కీలపాలూరు సమీపంలోని విరగలూరు గ్రామంలో బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. యూనిట్ లోపల పేలుళ్లు దాదాపు మూడు గంటల పాటు కొనసాగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్టు సమాచారం.

పేలుడు సంభవించినప్పుడు శివకాశి, తిరువయ్యారు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులు బాణసంచా యూనిట్‌లో పని చేస్తున్నారు. క్షతగాత్రులను రెండు ఆసుపత్రుల్లో చేర్పించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

విరగలూరు గ్రామంలోని సౌత్ స్ట్రీట్‌కు చెందిన కె రాజేంద్రన్ (65)కి చెందిన లైసెన్స్‌డ్ యూనిట్ 2014 నుండి నడుస్తోంది. రాజేంద్రన్ బాణాసంచా యూనిట్‌కు కిలోమీటరు దూరంలో తంజావూరు-అరియలూరు రహదారిలో పటాకుల రిటైల్ దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ యూనిట్ పేలుడు పదార్థాలను తయారు చేసి గోడౌన్లలో నిల్వ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు సరఫరా చేస్తుంది. యూనిట్‌ను నిర్వహిస్తున్న రాజేంద్రన్‌, అతని అల్లుడు ఎ అరుణ్‌కుమార్‌ (40)ని అరెస్టు చేశారు.