ఆదివారం రాత్రి జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యలో ముస్లింల ప్రమేయం ఉందని కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. ముస్లిం సంఘ వ్యతిరేక శక్తులు కార్యకర్తను హత్య చేశాయని ఆరోపిస్తూ, హర్ష, ఈశ్వరప్ప సోమవారం విలేకరులతో మాట్లాడారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో తాను చాలా కలత చెందానని.. పరిస్థితిని విశ్లేషించడానికి తాను శివమొగ్గ వెళ్తున్నానని ఆయన తెలిపారు.
నేరస్తులు ఎవరనే దానిపై పోలీసులకు ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని.. శివమొగ్గలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.
అయితే ఈశ్వరప్ప ఆరోపణలపై బొమ్మై స్పందించలేదు. త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా వస్తుందని చేసిన వ్యాఖ్యలపై ఈశ్వరప్ప ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈశ్వరప్ప ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డీకే శివకుమార్ స్పందిస్తూ, “అతను ఇప్పటికే భారత జెండా కోడ్‌ను ఉల్లంఘించాడు.
అతనిపై కేసు నమోదు చేసి..మంత్రివర్గం నుంచి తొలిగించాలని ఆయన అన్నారు. ఈ. ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఈ ఘటనపై హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు