Madarsas -English : మదర్సాల్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్

Madarsas -English : మదర్సా.. ఈ పేరు వినగానే ఉర్దూ, అరబిక్ మాత్రమే బోధిస్తారని మనం అనుకుంటాం.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 07:46 AM IST

Madarsas -English : మదర్సా.. ఈ పేరు వినగానే ఉర్దూ, అరబిక్ మాత్రమే బోధిస్తారని మనం అనుకుంటాం. కానీ ఇకపై తమ రాష్ట్రంలోని మదర్సాల్లో గణితం, సైన్స్‌, కన్నడ, ఇంగ్లీషు భాషలను బోధిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన, వక్ఫ్ భూముల్లో నిర్వహిస్తున్న మదర్సాలలో రెండేళ్లపాటు ప్రయోగాత్మకంగా ఈ సబ్జెక్టులను బోధిస్తామని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మదర్సా విద్యార్థులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ, గ్రాడ్యుయేషన్ పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలలకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశామని సీఎం తెలిపారు. తొలి విడతగా 100 మదర్సాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మదర్సాలలో చదువుతున్న విద్యార్థులకు మెయిన్ స్ట్రీమ్ విద్యార్హతలకు అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఓఎస్)తో ఒప్పందం కుదుర్చుకోనుందని(Madarsas -English) చెప్పారు.

Also Read: Sammakka Sarakka University : ‘సమ్మక్క సారక్క వర్సిటీ’ బిల్లుకు లోక్సభ అప్రూవల్