మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో డిసెంబరు 6న బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. సుమారు 400 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు తన్మయ్ సాహును 65 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీశారు. అయితే దురదృష్టవశాత్తు బాలుడు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. బాలుడి మృతదేహాన్ని బెతుల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.బోరుబావి ప్రాంతం అంతటా రాళ్లు ఉండటంతో నాలుగు రోజులకు పైగా ఆపరేషన్‌లో జాప్యం జరిగింది. పొలంలో ఆడుకుంటున్న బాలుడు మరో పొలానికి వెళ్లి తెరిచిన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని బయటకు తీసేందుకు సమాంతర సొరంగం తవ్వేందుకు జేసీబీలను తెప్పించారు. తన్మయ్ సాహును శుక్రవారం అర్థరాత్రి బయటకు తీసే వరకు 400 అడుగుల లోతున్న బోరుబావిలో 55 అడుగుల వద్ద ఇరుక్కుపోయాడు. జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం మృతదేహాన్ని బయటకు తీయగానే మరణించినట్లు తెలిపారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ బోరుబావిలో పడిన బాలుడు మృతి.. 65 గంటల పాటు రెస్క్యూ

Borewell Imresizer