Site icon HashtagU Telugu

Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు

Ed Raids On Lottery King Santiago Martin Chennai

Lottery King : శాంటియాగో మార్టిన్‌ .. ఈయనను లాటరీ కింగ్‌ అని పిలుస్తుంటారు. గతంలోనూ లాటరీ కింగ్‌‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ చేసింది. తాజాగా మరోసారి ఇవాళ (గురువారం)  శాంటియాగో మార్టిన్‌‌పై ‌‌ ఈడీ దాడులు జరిగాయి. లాటరీ కింగ్‌‌‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్‌ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి చెన్నై సహా పలు ప్రాంతాల్లోని శాంటియాగో మార్టిన్ కార్యాలయాలు, నివాసాలపై రైడ్స్ జరుగుతున్నాయి.

ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌‌పై అభియోగాలు..

మార్టిన్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉండటం గమనార్హం. ఈ కంపెనీ ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంటుంది. అందుకే మార్టిన్ సంపాదన భారీగా ఉంటుంది.  ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ మనీలాండరింగ్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఈడీ ఆరోపిస్తోంది. లాటరీ స్కీంల వ్యవహారంలో సిక్కిం ప్రభుత్వానికి రూ.900 కోట్ల నష్టం తీసుకొచ్చిన కేసులో గతేడాది మార్టిన్‌పై ఈడీ రైడ్స్ చేసింది. ఆ సమయంలో దాదాపు రూ.450 కోట్ల మార్టిన్ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. అంతకుముందు 2011లో కోయంబత్తూర్‌లో మార్టిన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణలు, మోసం చేయడం వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.

Also Read :World Diabetes Day 2024 : డయాబెటిస్ తీవ్రమైతే రక్తనాళాలకు పెద్ద గండం

ఎవరీ మార్టిన్ ?

Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు