Vastu Tips : నిద్రపోయే ముందు ఈ తప్పులు చేయకండి…అప్పుల పాలవుతారు..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 06:48 PM IST

అదృష్టం బాగుంటే కొంతమంది రాత్రికి రాత్రే కోటిశ్వరులు అవుతారు. మరికొంత మంది కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఎంతో కష్టపడుతుంటారు. తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎన్నో వ్యాపారలు చేస్తుంటారు. ఏవీ సాధ్యం కానప్పుడు దేవుడు ముందు కూర్చుండి ప్రార్థిస్తుంటారు. హోమాలు, హరకేతులు చేస్తుంటారు. అయినా కూడా చేతిలో చిల్లగవ్వ మిగలదు.

చేతికి వచ్చినా..నోటికి రాని పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో ఎదుగదల ఉండదు. ఉద్యోగంలో పదోన్నతి ఉండదు. అయితే అలాంటి సమస్యలు మీరూ ఎదుర్కొంటున్నట్లయితే…వాస్తు శాస్త్రంపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. మీరు ప్రతిరోజూ నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్లు ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. ఆదాయం పతనానికి దారి తీస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో లాకర్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇంట్లో చీకటిగా ఉండకూడదు.
చాలామంది పడుకునేందు ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి పడుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. పడుకునే ముందు ఇంట్లో ఒక లైట్ ను అలాగే ఉంచాలి. శాస్త్రాల ప్రకారం ఇంట్లో దీపాన్ని ఉంచడం చాలా మంది. ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండాలి. ఇల్లంతా కూడా చీకటిగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.

రాత్రిపూట డబ్బును లెక్కించవద్దు :
కొంతమంది రాత్రి పడుకునే ముందు డబ్బును లెక్కిస్తుంటారు. మంచం మీద నోట్లు పెట్టి లేక్కించడం చాలామందిని చూసి ఉంటాం. శాస్త్రాల ప్రకారం, నిద్రపోయే ముందు రాత్రివేళలో డబ్బును లెక్కించకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బులు లెక్కపెట్టాల్సిన అవసరం వచ్చినా, ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా ముందుగా లక్ష్మీదేవిని స్మరించుకోవాలి. లక్ష్మీదేవికి దండం పెట్టుకున్న తర్వాతే ఎవరికైనా ఇవ్వాలి.

పడుకునే ముందు బట్టలు మార్చుకోండి:
చాలా మంది రాత్రిపూట పడుకునేముందు పగటిపూట ధరించి దుస్తువులతోనే పడుకుంటారు. ఇది తప్పు అని శాస్త్రం చెబుతోంది. రాత్రి పడుకునే ముందు బట్టలు మార్చుకోవాలి. రాత్రిపూట నగ్నంగా నిద్రించకూడదు. రాత్రిపూట నగ్నంగా నిద్రించే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు.

పాదాల శుభ్రత:
రాత్రి పడుకునే ముందు పాదాలను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తడి పాదాలతో నిద్రపోవడం మంచిది కాదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానిస్తుంది.

ఈ వస్తువులను తల పక్కన పెట్టొద్దు:
పడుకున్న తర్వాత చాలా మంది మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు వాడుతుంటారు. నిద్రలోకి జారుకున్న వెంటనే దిండు పక్కన పెట్టుకుని పడుకుంటాడు. కానీ రాత్రి పూట దిండు పక్కన ఎలాంటి గాడ్జెట్ పెట్టకూడదు. అలాగే పదునైన వస్తువులను ఉంచవద్దు. దీంతో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ఆరోగ్యం పాడవుతుంది. ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది.

పాల పాత్రను మూతపెట్టాలి:
పాలను వేడి చేసిన తర్వాత తెరవకూడదు. దానిని మూత కప్పి ఉంచాలి. పాల పాత్రను రాత్రిపూట మాత్రమే కాకుండా పగలు కూడా కప్పి ఉంచాలి. పాల పాత్రను అలాగే ఉంచితే ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. ఇది ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేలా చేస్తుందని శాస్త్రాలలో పేర్కొన్నారు.

వంటగది శుభ్రత:
రాత్రి పడుకునే ముందు వంటగది శుభ్రతపై శ్రద్ధ వహించాలి. గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండాలి. అలాగే సింక్‌లో పాత్రలు ఉండకూడదు. రాత్రిపూట స్టవ్‌ను గుడ్డతో కప్పండి. స్టవ్ మీద ఎలాంటి పాత్రలూ పెట్టకూడదు.