Sunil Kanugolu : కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించింది ఇతడే.. సునీల్ కనుగోలు.. ఎవరితను?

కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటానికి ఓ ముఖ్య కారణం సునీల్ కనుగోలు(Sunil Kanugolu). ఇతను ఎవరో తెలుసా?

Published By: HashtagU Telugu Desk
do you know about karnataka congress success reason political strategist sunil kanugolu

do you know about karnataka congress success reason political strategist sunil kanugolu

కర్ణాటక(Karnataka)లో గెలిచిందని కాంగ్రెస్(Congress) సంబరాలు చేసుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఇంతటి భారీ విజయం చూడటంతో అగ్రనాయకులు నుంచి కార్యకర్తల వరకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటానికి ఓ ముఖ్య కారణం సునీల్ కనుగోలు(Sunil Kanugolu). ఇతను ఎవరో తెలుసా?

సాధారణంగా మన దేశంలోని పొలిటికల్ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి తాము చేసేవే కాకుండా ఓ పొలిటికల్ వ్యూహకర్తని నియమించుకుంటారు. వీళ్ళు అన్ని చోట్ల సర్వేలు చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా గెలవాలి అని వ్యహ రచనలు చేస్తారు. మన అందరికి ఎన్నికల వ్యూహకర్త అంటే ముందు గుర్తొచ్చేది ప్రశాంత్ కిషోర్. ఇటీవల మన దేశంలో చాలా పార్టీలు గెలవడానికి ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore) ముఖ్య కారణం.

ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన సునీల్ కనుగోలు తనకంటూ సొంత కుంపటి పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఈ కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ ని పని చేయమని భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ ప్రశాంత్ కిషోర్ నో చెప్పడంతో ఆ ఆఫర్ సునీల్ కి దక్కింది. 2018 కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ కోసం పనిచేసిన సునీల్ ఇప్పుడు 2023 లో అదే కర్ణాటకలో కాంగ్రెస్ కోసం పనిచేసి గెలిపించాడు.

పొత్తులు అవసరం లేకుండానే కాంగ్రెస్ ని సునీల్ గెలిపించాడు. కాంగ్రెస్ కర్ణాటకలో గెలవడానికి సునీల్ కూడా ముఖ్య కారణం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఇప్పుడు సునీల్ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతుంది. వచ్చే 2024 ఎలక్షన్స్ కి కూడా సునీల్ కాంగ్రెస్ తరపున పనిచేయబోతున్నాడు. కర్ణాటక రిజల్ట్ తో కాంగ్రెస్ ఫుల్ హ్యాపీగా ఉండటంతో నెక్స్ట్ జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్ కి కూడా సునీల్ కే వ్యూహకర్తగా పూర్తి బాధ్యతలు అప్పచెప్పింది. గతంలోనే సునీల్ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడాడు. ఇప్పుడు మరింత ఫోకస్ పెట్టనున్నాడు సునీల్. మరి సునీల్ కనుగోలు కాంగ్రెస్ కి మున్ముందు విజయాలను ఇలాగే అందిస్తాడా చూడాలి.

 

Also Read : Telangana Congress : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే?

  Last Updated: 13 May 2023, 06:59 PM IST