తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ గురువారం రోడ్డు ప్రమాదంలో అక్కడి అధికార డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ కుమారుడు రాకేష్(22) మృతి చెందారు. డీఎంకే ఎంపీ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా, అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక ఈ ప్రమాదంలో ఎంపీ కుమారుడు రాకేష్ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదంలో ఈకారు నజ్జు నుజ్జు అయ్యింది. ఇక రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ సహాయంతో రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశాడు. అలాగే గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మాజీ సీనియర్ న్యాయవాది ఇళంగోవన్ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.