DMK MP Tiruchy Siva’s son : తమిళనాడులో డీఎంకేకు షాక్! పార్టీ ఎంపీ కుమారుడు బీజేపీలో చేరిక

తమిళనాడులో డీఎంకే పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ స్టాలిన్ కలవరపడే అంశం చోటుచేసుకుంది. డీఎం ఎంపీ, ఆ పార్టీ ప్రముఖ నేతల్లో ఒకరైన తిరుచ్చి శివ కుమారుడు సూర్య శివ తండ్రికి ఎదురెళ్లారు. డీఎంకే పార్టీని వీడి దానికి బద్ధ శత్రువైన బీజేపీలో చేరారు

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 12:11 PM IST

తమిళనాడులో డీఎంకే పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ స్టాలిన్ కలవరపడే అంశం చోటుచేసుకుంది. డీఎం ఎంపీ, ఆ పార్టీ ప్రముఖ నేతల్లో ఒకరైన తిరుచ్చి శివ కుమారుడు సూర్య శివ తండ్రికి ఎదురెళ్లారు. డీఎంకే పార్టీని వీడి దానికి బద్ధ శత్రువైన బీజేపీలో చేరారు. దీంతో స్టాలిన్ తోపాటు ఆయన పార్టీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

తమిళనాట అంతా తమ పాలనను పొగుడుతున్నారన్న అభిప్రాయంతో ఉంది డీఎంకే. ఇలాంటి సమయంలో పార్టీ ఎంపీ కుమారుడు కమలతీర్థం పుచ్చుకున్నాడంటే.. దాని ప్రభావం పార్టీ పడుతుందా అని ఆలోచిస్తోంది. పైగా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయమున్నా ఎందుకు సీన్ మారింది అని కూడా యోచిస్తోంది. నిజానికి సూర్యశివ పార్టీ మారింది.. తండ్రికి వ్యతిరేకంగా. పనిలో పనిగా డీఎంకేపైనా విమర్శలు గుప్పించాడు.

డీఎంకే కుటుంబ పార్టీ అని.. కొన్ని కుటుంబాల కోసం కష్టపడడానికి బదులు బీజేపీలో చేరితే ప్రజలకు సేవ చేయచ్చన్నారు. తిరుచ్చిలో బీజేపీని గెలిపించడానికి కృషి చేస్తానన్నారు. తాను కులాంతర వివాహం చేసుకోవడంతో తనను, తన భార్యాపిల్లల్ని తన తండ్రి పట్టించుకోవడం లేదని సూర్యశివ ఆరోపించారు. పైగా డీఎంకేలో ఎలాంటి పదవి రాకుండా ఆయన అడ్డుకున్నారన్నారు. అందుకే బీజేపీలో చేరానన్నారు.

15 ఏళ్లుగా డీఎంకేలో ఉన్నానని.. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లూ కష్టపడినా సరే.. పార్టీ గుర్తించలేదన్నారు. కార్యకర్తలను, కిందిస్థాయి నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయినా బీజేపీ ఉన్నట్టుండి ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో డీఎంకే షాకైంది. పార్టీ నుంచి ఎవరూ కమలతీర్థం పుచ్చుకోకుండా జాగ్రత్తపడుతోంది.