Site icon HashtagU Telugu

Karnataka Elections : కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు బీఫామ్‌లు అందించిన క‌ర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌

Congress Hashtag

Congress Hashtag

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స‌ర్వంసిద్ద‌మ‌వుతుంది. ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్ బీఫామ్‌ల‌ను పంపిణీ చేశారు.మే 10న క‌ర్ణాట‌కలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ తన తొలి జాబితాలో 124 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో మరో 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే మిగిలిన అభ్యర్థులను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఐదవ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని అధిష్టానం నియ‌మించింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ కెపిసిసి అధ్యక్షుడిగా ఉండగా, ఆ పార్టీకి ఇప్పటికే మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు – రామలింగారెడ్డి, ఈశ్వర్ ఖండ్రే, సలీమ్ అహ్మద్ మరియు సతీష్ జార్కిహోలి. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిఎన్ చంద్రప్ప నియమితులయ్యారు. చంద్రప్ప 2014లో చిత్రదుర్గ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార బీజేపీ 119 స్థానాలతో మెజారిటీని కలిగి ఉండగా, కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు వరుసగా 75, 28 స్థానాలు ఉన్నాయి.

Exit mobile version