Karnataka CM: కర్ణాటక హోంమంత్రి డీకే ? హైకమాండ్ ముందున్న డిమాండ్స్

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై హైడ్రామా కొనసాగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Karnataka Cm (1)

Karnataka Cm (1)

Karnataka CM: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై హైడ్రామా కొనసాగుతుంది. సీఎం రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా సిద్ధరామయ్య సీఎం కావడం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం సిద్దరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది.

సీఎం పేరు ఖరారు కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న శివకుమార్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. కర్నాటక ఎన్నికలలో సంస్థకు నాయకత్వం వహించడం ద్వారా పార్టీకి చేసిన సహకారాన్ని ఉటంకిస్తూ, తాను ముఖ్యమంత్రి పదవికి సహజ పోటీదారునని శివకుమార్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం కర్ణాటక సీఎం రేసు నుంచి డీకే తప్పుకున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. డీకేని కాంగ్రెస్ హై కమాండ్ బుజ్జిగించిందని, అయితే డీకే డిమాండ్లను కాంగ్రెస్ ఒప్పుకుందని సమాచారం. డీకే కాంగ్రెస్ హైకమాండ్ ముందుంచిన డిమాండ్లు ఏంటంటే… తన అనుచర వర్గంలోని ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని, రెండేళ్లు సిద్దరామయ్య, రెండేళ్లు డీకే సీఎం గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇకపోతే వచ్చే ఐదేళ్లు కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగవచ్చని హైకమాండ్ హామీ ఇచ్చిందట. అలాగే డీకే శివకుమార్ కి హోంశాఖ లేదా డిప్యూటీ సీఎం కేటాయించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించారని సమాచారం. అయితే డీకే డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే చెప్పిందని అక్కడి మీడియా కోడైకూస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ మెజారీటీతో విజయం సాధించింది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 135 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరోవైపు బీజేపీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. కింగ్‌మేకర్‌ కావాలన్న జేడీఎస్‌ ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు 19 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులకు నాలుగు సీట్లు వచ్చాయి.

Read More: Kajal Agarwal : బ్లాక్ అవుట్ ఫిట్ లో కాజల్ అగర్వాల్ మెరుపులు

  Last Updated: 17 May 2023, 03:25 PM IST