Site icon HashtagU Telugu

Car Discounts On Diwali: దీపావళి పండుగకు బంపర్ ఆఫర్.. కారుపై ఏకంగా లక్ష రూపాయలు తగ్గింపు?

Car Discounts On Diwali

Car Discounts On Diwali

సాధారణంగా పండుగ వచ్చింది అంటే చాలు కంపెనీలు కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను ఇస్తూ ఆకర్షిస్తూ ఉంటారు. ఎక్కువగా డిస్కౌంట్లు పెడుతూ కస్టమర్ లను సంతోష్ పెడుతూ ఉంటారు. వాహనాలను విక్రయించే కంపెనీలు,షాపింగ్స్ మాల్స్ లో ఇలా డిస్కౌంట్ అని పెడుతూ ఉంటారు. ఇకపోతే మొన్నటి వరకు కూడా దసరా పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ లలో వినియోగదారులు వాహనాలను ఇతర వాటిని కొనుగోలు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా ప్రముఖ కార్ల కంపెనీలు కార్లపై డిస్కౌంట్ ఇచ్చి కళ్ళు చెదిరే డీల్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.

మరి దీపావళి పండుగ సందర్భంగా ఏఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ని ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్‌ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ కోనా ఎలక్ట్రిక్ కారు ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుందట. హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ 10 నియోస్ కారు ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. ఈ కారు పై దాదాపు రూ. 48 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. ఇక క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు ఉంటుందట. హ్యుందాయ్ ఐ20 కారు పై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి. ఈ ఐ20 కారు ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షలుగా ఉంటుందట. హ్యుందాయ్ ఆరా కారు పై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు, అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు గా ఉంటుందిఈ ఈ హ్యుందాయ్ ఆరా కారు ప్ధర రూ. 6.09 లక్షల నుంచి 8.87 లక్షలు ఉంటుంది.