Site icon HashtagU Telugu

Dinesh Karthik: బెంగళూరుకు మరో ఏబీడీలా డీకే

Dinesh Karthik Kkr Imresizer

Dinesh Karthik Kkr Imresizer

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఆర్సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా డీవిలియార్స్ క్రీజులో ఉంటే చాలు…ఎలాగైనా మ్యాచ్‌ను గెలిపిస్తాడనే నమ్మకం అభిమానులకు కలిగించాడు డివిలియర్స్. అయితే ఊహించనిరీతిలో గతేడాది ఐపీఎల్ ముగిసాక రిటైర్మెంట్ పలికాడు. అయితే అతని మెరుపు ఇన్నింగ్స్ లను మల్లి ఐపీఎల్ లో చూడలేము అనుకున్న ఆర్సీబీ అభిమానులకు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్ కార్తీక్‌ రూపంలో ఓ మ్యాచ్ ఫినిషర్ దొరికాడు. గత కొంత కాలంగా నిరాశలో ఉన్న ఆర్సీబీ అభిమానుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఆర్సీబీ తరఫున అదరగొడుతున్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగిన దినేశ్‌ కార్తిక్‌ను ఐపీఎల్‌ 15వ సీజన్ మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ రూ. 5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇందుకు తగినట్లుగా నిలకడగా రాణిస్తున్న దినేశ్‌ కార్తిక్‌ ఆర్సీబీ జట్టు విజయాల్లో ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 209.57 స్ట్రయిక్‌ రేట్‌తో197 పరుగులు సాధించాడు. బెంగళూరు తరఫున ఒత్తిడి పరిస్థితుల్లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ చెలరేగుతున్న దినేష్ కార్తీక్ అచ్చం ఏబీ డివిలియర్స్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే వికెట్ కీపర్‌గా ఉంటూనే బౌలర్లకు, ఫీల్డర్లకు కీలక సూచనలు చేస్తున్నాడు. దీంతో అటు బ్యాట్స్‌మన్‌గానే వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా రాణిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దినేష్ కార్తీక్‌ రాబోయే మ్యాచుల్లో కూడా ఇలాగే చెలరేగితే ఈసారి ఆర్సీబీ ట్రోఫీ గెలవడం ఖాయమంటున్నారు.