Site icon HashtagU Telugu

Family Politics : ఎన్నికల సమరంలో మాజీ ప్రధాని దూకుడు.. ముగ్గురు బరిలోకి !

9 Candidates One Family

9 Candidates One Family

Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు.   కానీ ఒక ఫ్యామిలీ నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

ఎన్నికల క్షేత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలిపిన ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడున్న మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ పార్టీ అధినేత దేవెగౌడ కుటుంబంలోని రాజకీయ నేతల సమాచారాన్ని కూడగట్టాలి.  ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు జేడీఎస్(Family Politics) పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.  దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. ఈ ఎలక్షన్లలో బీజేపీ- జేడీఎస్ పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, జేడీఎస్‌కు 3 కేటాయించారు.  దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్‌ ప్రాంతంలో జేడీఎస్‌కు మంచి పట్టు ఉంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.

Also Read : Israel Vs Iran : అమెరికా పక్కకు తప్పుకో.. ఇజ్రాయెల్ పనిపడతాం : ఇరాన్

Also Read : Indian Student Dies In US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన