Site icon HashtagU Telugu

Delhi Fire Dept: ఢిల్లీలో ఈసారి అత్యధిక ప్రమాదాలు.. 12 గంటల్లో 318 కాల్స్!

Delhi Fire Dept

Delhi Fire Dept

Delhi Fire Dept: ఢిల్లీలో దీపావళి సందర్భంగా అర్థరాత్రి వరకు వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక శాఖకు 318 కాల్స్ వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పలు ఇళ్లలో అగ్నిప్రమాద ఘటనలు (Delhi Fire Dept) చోటు చేసుకున్నాయి. వీటిలో గ్రేటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలోని ఫ్లాట్లలో చాలా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ కాల్స్ అన్నీ దృష్టిలో ఉంచుకుని వాహనాలను పంపినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. దేశమంతా దీపావళి పండుగ సంబరాల్లో మునిగితేలుతున్న సమయంలో అగ్నిమాపక సిబ్బంది వివిధ చోట్ల మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

దేశ రాజధానిలో దీపావళి దృష్ట్యా అగ్నిమాపక శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అగ్నిమాపక దళానికి కాల్స్ వస్తూనే ఉన్నాయి. బృందం రాత్రంతా పరుగులు పెట్టింది. గత 10 ఏళ్లలో ఈసారి అత్యధికంగా ప్రమాదాలకు సంబంధించిన కాల్స్‌ వచ్చాయి. కేవలం 12 గంటల్లోనే అగ్నిమాపక సిబ్బందికి 318 కాల్స్ వచ్చాయి.

Also Read: Sugar Levels: ఈ జ్యూస్‌లతో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది!

అక్టోబర్ 31 దీపావళి సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 1 ఉదయం 5 గంటల వరకు 318 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటి అగ్నిప్రమాదాలు జరిగినా పెద్దగా నష్టం జరగలేదు.

సాగర్‌పూర్‌లో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొక సంఘటన దర్యాగంజ్‌లో జరిగింది, ఒకరు మరణించారు. దీనికి సంబంధించి ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. రాజధానిలో 3200 మంది అగ్నిమాపక దళ సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలో బాణసంచా నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో దహన ఘటనలు చోటు చేసుకోకూడదని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత 10 ఏళ్లలో ప్రమాద కాల్స్