Site icon HashtagU Telugu

Heart Attack : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Delhi Cop Dies Moments Afte

Delhi Cop Dies Moments Afte

ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ముందు వరకు కూడా గుండెపోటు మరణాలు తక్కువగా నమోదు అవుతూ ఉండేవి..అవి కూడా 60 , 70 ఏళ్ల పైబడిన వారు గుండెపోటుకు గురయ్యి మరణించేవారు..కానీ ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఐదేళ్ల చిన్నారుల దగ్గరి నుండి 90 ఏళ్ల ముసలాడి వరకు ఇలా అందరికి గుండెపోటు అనేవి వస్తున్నాయి. అప్పటివరకు సంతోషంతో మన మద్యే ఉన్న వారు సడెన్ గా కుప్పకూలి..అక్కడిక్కడే మృతి చెందుతున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఢిల్లీలో రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

రూప్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ (Rupnagar Police Station)లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్లిపోతున్నారు. ఈ సందర్బంగా ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్‌ (Ravikumar) ఉన్నట్టుండి కిందపడిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు హాస్పటల్ కు తీసుకెళ్లగా..అప్పటికి అతడు మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారు. దీంతో అతని మిత్రులతో పటు సీనియర్ అధికారులు ఒక్కసారిగా షాక్‌ కు గురైయ్యారు. తమతో పాటూ వర్క్ చేస్తూ…పార్టీలో సరదాగా ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోయారు.

రవికుమార్ (35) 2010లో ఢిల్లీ పోలీస్‌గా విధుల్లో జాయిన్ అయ్యారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 45 రోజుల క్రితమే గుండె పని తీరును తెలిపే యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అప్పుడు ఏ లోపం లేదు..ఇప్పుడు సడెన్ గా మరణించడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Read Also : Zepto : 5 బిలియన్ల విలువతో 340 మిలియన్లను సమీకరించిన జెప్టో