Site icon HashtagU Telugu

Karur Stampede : తొక్కిసలాటలో 40కి చేరిన మృతుల సంఖ్య

Tvk Vijay Rally In Karur Tr

Tvk Vijay Rally In Karur Tr

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటన రాష్ట్రాన్ని, దేశాన్ని కలిచివేసింది. నిన్న TVK పార్టీ చీఫ్ విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట మూడుగురే మృతి చెందారని వార్తలు వచ్చినా, తరువాత గాయపడినవారి పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగి, ఈరోజు 40కి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు ఈరోజు ఉదయం మరణించడంతో ఈ సంఖ్యకు చేరినట్లు అధికారులు ధృవీకరించారు.

CBN Meets Pawan : పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఈ తొక్కిసలాటలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మరింత దుర్ఘటనగా మారింది. భారీగా జనసందోహం ఏర్పడటం, సదుపాయాలు తక్కువగా ఉండటం, తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉండటం, నాయకుడిని చూసేందుకు వేలాది మంది ఒకే స్థలంలో గుమికూడటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి తగిన చికిత్స అందించేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఘటన వల్ల రాష్ట్రవ్యాప్తంగా శోకసంద్రం నెలకొంది. భవిష్యత్తులో ఇలాంటి సభల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడం, ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Exit mobile version