క‌ట్టెలు కొట్టే వ్య‌క్తి కూతురికి ఎంబీబీఎస్ సీటు

శివగంగలో కట్టెలు కొట్టే వ్యక్తి కూతురు మెడికల్ సీటు సాధించింది. శివగంగ సమీపంలోని కాయంగుళం కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్‌, కాళీముత్తుల పెద్ద కుమార్తె ఎస్‌.స్నేహ.

  • Written By:
  • Updated On - January 31, 2022 / 11:33 AM IST

శివగంగలో కట్టెలు కొట్టే వ్యక్తి కూతురు మెడికల్ సీటు సాధించింది. శివగంగ సమీపంలోని కాయంగుళం కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్‌, కాళీముత్తుల పెద్ద కుమార్తె ఎస్‌.స్నేహ. ఈమెకు ఇద్దరు సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నారు. ఆమె తల్లి కాళీముత్తు మహాతమా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప‌నికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈమె తండ్రి క‌ట్టేలు కొడుతూ జీవ‌నం సాగిస్తున్నారు.అయితే త‌న కూతుర్ని క‌ష్ట‌ప‌డి చ‌దివించారు. నీట్ కోచింగ్ కి వెళ్లాలంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని కాబ‌ట్టి స్నేహ ఇంటి నుండి నీట్‌కు సిద్ధమై 199 మార్కులు సాధించింది. కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5% కోటా కింద కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. నీట్‌కు భయపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి కష్టపడి చదివితే వైద్య కళాశాల సీటు సాధించ‌వ‌చ్చ‌ని స్నేహ తెలిపారు.