Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!

  • Written By:
  • Updated On - November 21, 2022 / 03:31 PM IST

స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు చూసింది.

గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు దళిత మహిళ అక్కడికి వచ్చింది. లింగాయత్ వీధికి ఎదురుగా ఉన్న పబ్లిక్ కుళాయిలోని నీళ్లు తాగింది. దీన్ని అక్కడున్న వారు గుమనించారు. వెంటనే నీరు తాగుతున్న మహిళను అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత ఈ కుళాయి తెరిచి గోమూత్రంతో శుద్ధి చేశారు. ఇందంతా గమనించిన గ్రామంలోని కొందరు యువకులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ తోపాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ మహిళ ఫిర్యాదు ఇస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోనూ ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ముగ్గురు యువకులు దళిత యువకుడిపై దాడి చేసి హత్య చేశారు.