Kerala: గవర్నర్‌ తీరుని నిరసిస్తూ కేరళలో భారీ ర్యాలీ చేపట్టనున్న సిపిఎం

రాష్ట్ర విద్యాశాఖలో ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేయాలన్న గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ర్యాలీ చేపట్టనుంది.

Published By: HashtagU Telugu Desk
Kerala Governor

Kerala Governor

రాష్ట్ర విద్యాశాఖలో ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేయాలన్న గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ర్యాలీ చేపట్టనుంది. నేతల సూచన మేరకు సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం విద్యా పరిరక్షణ సమితిని ప్రారంభించింది. ఈ సమితి ఆధ్వర్యంలో నవంబర్‌ 15న రాజ్‌భవన్‌కు భారీ ర్యాలీ చేపట్టనుంది.

శబరిమల వివాదం తరహాలో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని చేపట్టాలని సిపిఎం భావిస్తోంది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి మహిళలను ఆలయంలోని అనుమతించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా వివిధ సంఘాలు, సామాజిక సంస్థలతో కలిసి పునరుజ్జీవన సమితి వేదికగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

  Last Updated: 07 Nov 2022, 08:08 PM IST