ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగని ఎలా ముగిస్తారో తెలుసా…?

కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గ్రామంలో దీపావ‌ళి ముగింపు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.ఈ వేడుక‌ల్లో ఆవు పేడ‌తో యుద్ధం చేస్తారు.దీనిని గొరెహ‌బ్బ పండుగ అని అక్క‌డి ప్ర‌జ‌లు పిలుచుకుంటారు. అస‌లు ఆవుపేడ‌తో యుద్దం ఏంటి అని మీకు అనుమానం క‌లుగ‌వ‌చ్చు.ఈ యుద్ధం ఎలా జ‌రుగుతుందో వివ‌రాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - November 8, 2021 / 03:11 PM IST

కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గ్రామంలో దీపావ‌ళి ముగింపు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.ఈ వేడుక‌ల్లో ఆవు పేడ‌తో యుద్ధం చేస్తారు.దీనిని గొరెహ‌బ్బ పండుగ అని అక్క‌డి ప్ర‌జ‌లు పిలుచుకుంటారు. అస‌లు ఆవుపేడ‌తో యుద్దం ఏంటి అని మీకు అనుమానం క‌లుగ‌వ‌చ్చు.ఈ యుద్ధం ఎలా జ‌రుగుతుందో వివ‌రాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

Also Read : జలవలయంలో చెన్నై.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన

క‌ర్నాట‌క‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోగుమటాపురా అనే గ్రామం ఉంది.ఈ గ్రామంలోని ప్ర‌జ‌లు ప్రతి సంవత్సరం దీపావళి ముగింపును ఆవు పేడతో యుద్ధం చేస్తారు. ఈ వేడ‌క‌ల్లో పాల్గొనే వారు మధ్యాహ్నం స‌మ‌యంలో ఆవుల‌ను క‌లిగి ఉన్న ఇళ్ల‌ను సంద‌ర్శిస్తారు. అంద‌రి ఇళ్ల‌లో ఉన్న ఆవు పేడ‌ను సేక‌రించి ట్రాక్ట‌ర్ల‌పై గ్రామంలోని ఆల‌యానికి తీసువ‌స్తారు. ఆ త‌రువాత ఆవు పేడ‌ను ఓ బ‌హిరంగ ప్ర‌దేశంలో పోస్తారు.గ్రామంలోని పురుషులు బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉన్న ఆవుపేడ‌లోకి వెళ్లి ఒక‌రిపై ఒక‌రు పిడికిలితో ఆవుపేడ‌ను విసురుకుంటారు. ఇలా ప్ర‌తి ఏడాది దీపావ‌ళి ముగింపు వేడుక‌ల‌ను ఇక్క‌డి గ్రామ‌స్తులు చేసుకుంటారు.ఈ వేడుక‌ల్ని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు ఈ గ్రామాల‌కు త‌ర‌లివ‌స్తారు.