ముఖ్యమంత్రి ముందే.. కొవిడ్ రూల్స్ బ్రేక్!

దసరా.. హిందువులకు పెద్ద పండుగ. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు.  కుటుంబమంతా ఒకే దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

  • Written By:
  • Updated On - October 16, 2021 / 03:49 PM IST

దసరా.. హిందువులకు పెద్ద పండుగ. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు.  కుటుంబమంతా ఒకే దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దసరా ఉత్సవాలు అనగానే చాలామందికి మైసూల్ ప్యాలెస్ లో జరిగే సెలబ్రేషన్స్ కళ్ల ముందు నిలుస్తాయి. నిన్న జరిగిన పండుగ సందర్భంగా మైసూర్‌ మహారాజు అయిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ తన పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.  ఈ ఆయుధాలతో ఎన్నో యుద్ధాలు జయించారు. అందుకే జాగ్రత్తగా వందల ఏళ్లుగా  వీటిని భద్రపర్చారు. మైసూర్ ప్యాలెస్ లో జరిగే ఈ సంబురాలకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అటెండ్ అవుతుంటారు. అయితే కొవిడ్ నేపథ్యంలో గతేడాది నామమాత్రంగానే ఈ ఉత్సవాలు జరిగాయి.

కానీ ఏడాది మాత్రం అంగరంగవైభవంగా మైసూర్ ఉత్సవాలు సాగాయి. వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమానో.. కరోనా తగ్గిందనే నిర్లక్ష్యమో కానీ ఈ ఏడాది ఉత్సవాలకు జనాలు భారీగా అటెండ్ అయ్యారు. దాదాపు 10 వేలమంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా సీఎంతో పాటు ఇతర అధికారులు, ప్రముఖులు 500 మంది వరకు హాజరయ్యారు.

నిన్న జరిగిన ఈ ఉత్సవాల్లో ఎక్కడా కూడా ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించలేదు. భౌతిక దూరం లేదు. మాస్కులు అసలే ధరించలేదు. దాదాపు 10 వేలమంది ఒకే దగ్గర చేరి ఉత్సవాలను జరుపుకున్నారు. అయితే కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ జంబూ సవారీలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాయకులు, అధికారుల సాక్షిగా ఇక్కడ కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.