కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యాక నిన్న(గురువారం 27) ఒక్క రోజే అత్యధికంగా 67వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 90 శాతానికి పైగా పెరిగింది. జనవరి 25న 53,093 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు అడపాదడపా పెరుగుతున్నాయి. గురువారం 38,083 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవ్వగా.. దానికి రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.04 శాతానికి తగ్గింది.
రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో డిశ్చార్జ్‌లలో, 43,997 బెంగళూరు నుండి వచ్చాయి. బెంగళూరులో గురువారం మరణాల రేటు 0.99 శాతానికి పడిపోయింది. డిశ్చార్జ్‌లు, తాజా కేసుల మధ్య భారీ వ్యత్యాసం కూడా రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 3,57,909 నుండి గురువారం 3,28,711కి పడిపోయింది. బెంగళూరులో బుధవారం నాటి 2,16,145 యాక్టివ్ కేసుల నుంచి 12.16 శాతం తగ్గి 1,89,853కి చేరుకుంది. ఏది ఏమైనప్పటికీ, మూడవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటి
కీ రికవరీ రేటు పెరగడం కొంత సంతోషించదగ్గ విషయమనే చెప్పాలి.