Site icon HashtagU Telugu

Karnataka: కర్ణాటకలో కోవిడ్ పరీక్షలు చేయాల్సిందేనంటున్న అడ్వైజరీ కమిటీ..కారణం ఇదే..?

కర్ణాటక : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించిన తరువాత ఆయన పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో
ప్రజలు తరలివచ్చారు.రెండు రోజుల తరువాత ఆయన అంత్యక్రియలు జరిగాయి.అంత్యక్రియలకు కూడా భారీగా జనం
హాజరైయ్యారు.దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనికోసం కరోనా పరీక్షలు
మరిన్ని చేయాలని కోవిడ్ 19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) కర్ణాటక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పరీక్షలను పెంచడం అత్యవసరం అని అడ్వైజరీ కమిటీలోని ఒక
సభ్యుడు తెలిపారు.బెంగుళూరులో కరోనా పెద్దగా లేనప్పటికీ ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు( సింధ్గి,హంగల్)ల్లో పరీక్షలు చేయాలని సూచించింది. బెంగళూరులోని పునీత్ రాజ్కుమార్ పార్ధీవదేహాన్ని చూసేందుకు ఆసుపత్రి, కంఠీరవ స్టేడియంకి జనం రావడంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.దీనిని పరిగణనలోకి తీసుకుని వచ్చే పక్షం రోజుల్లో నగరంలోని అన్ని రోగలక్షణ వ్యక్తులకు తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ (RAT)కి చేసినప్పుడు పాజిటివ్,నెగెటివ్ వచ్చిన వారందరికీ మళ్లీ RT-PCR పరీక్ష చేయాలని తెలిపారు.ట్రేసింగ్, ట్రాకింగ్ మరియు టెస్టింగ్ విఫలం లేకుండా కొనసాగించాలని… ఇన్ఫ్లుఎంజా లాంటి ఇన్ఫెక్షన్ (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కర్ణాటకలో మంగళవారం 239 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదుకాగా…ఐదుగురు కరోనాతో మరణించారు.376 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు ఆ సంఖ్య 29,42,272కి చేరుకుంది. రాష్ట్రంలో 8,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులు 29,88,760 నమోదవ్వగా మరణాల సంఖ్య 38,089కు చేరింది.60,711 పరీక్షలకు నెగిటివ్ వచ్చిన కేసులు 0.39 శాతంగా ఉంది. అయితే కరోనా మరణాల రేటు 2.09 శాతంగా ఉంది. రాష్ట్ర రాజధానిలో మంగళవారం మూడు మరణాలు సంభవించాయి.ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 16న కర్ణాటకలో కోవిడ్ వ్యాక్సిన్ 289వ రోజుకు చేరింది. రాష్ట్రంలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల వరకు 1,75,174 డోస్లను అందించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.

https://twitter.com/IEBengaluru/status/1455541289144012800

Exit mobile version