Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?

క‌ర్ణాట‌క‌లో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జ‌న‌వ‌రి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - January 9, 2022 / 08:22 PM IST

క‌ర్ణాట‌క‌లో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జ‌న‌వ‌రి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి. డిసెంబర్ 24 నుంచి 30వ తేదీ వ‌ర‌కు వారంలో బెంగళూరులో 1,023 కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో బెంగళూరులో కోవిడ్-19 కేసులు బాగా పెరిగాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే కేసులు ఆకస్మికంగా పెరగడానికి ఓమిక్రాన్ వేరియంట్ కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం బెంగళూరులో పాజిటివిటీ రేటు 10% దాటింది. డిసెంబర్ 31, 2021నుంచి జనవరి 6, 2022 మధ్య వారంలో పాజిటివిటీ రేటు 4.2% గా ఉంది. ఇది డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30, 2021 మధ్య వారంలో 0.88%గా ఉంది. అధికారులు తెలిపిన వివ‌రాల ప్రకారం సెంక‌డ్‌ వేవ్ యొక్క గరిష్ట స్థాయి నుండి మొదటిసారిగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య కూడా గత వారంలో స్థిరంగా పెరిగింది. జనవరి 5, 6 తేదీల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య వరుసగా 39,49 గా ఉన్న‌ట్లు BBMP వార్ రూమ్ నివేదిక‌ తెలిపింది. డిసెంబర్ 29, 2021, జనవరి 4, 2022 మధ్య వారంలో అడ్మిషన్ల సంఖ్య 78గా న‌మోదైయ్యాయి.

ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగినప్పటికీ.. వైరస్ కారణంగా మరణాల సంఖ్య పెద్ద‌గా న‌మోదు కావ‌డం లేదు. వార్ రూమ్ నివేదికలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రిలో చేరిన వారి రోజువారీ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ డి రణదీప్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, జనవరి 1నుంచి 7 తేదీల మధ్య పాజిటివ్‌గా పరీక్షించిన రోగుల విశ్లేషణ ప్రకారం, వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసిన వారి కంటే వ్యాక్సిన్ వేయని వ్యక్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉందని స్టేట్ కోవిడ్ వార్ రూమ్ హెడ్ మునీష్ మౌద్గిల్ తెలిపారు. వ్యాక్సిన్ వేసిన జనాభాతో పోలిస్తే, వ్యాక్సిన్ వేయని వారు ICU లేదా HDUలో చేర‌నే అవ‌కాశం 30 రెట్లు ఎక్కువగా ఉంది. 97% మంది పౌరులు టీకాలు వేయబడ్డారని మ‌రో 3% మందికి మాత్ర‌మే టీకాలు వేయలేదని మునీస్ మౌద్గిల్ తెలిపారు. ఇద్దరూ సమానంగా కోవిడ్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే.. ప్రతి 100 కోవిడ్ కేసులు లేదా ఆసుపత్రిలో చేరిన కేసులకు – 97 మందికి టీకాలు వేయబడి ఉండాలని.. ముగ్గురికి టీకాలు వేయకుండా ఉండాలి. కానీ దామాషా ప్రకారం టీకాలు వేయనివారు కోవిడ్ రోగుల సంఖ్య కంటే ICUలో 30 రెట్లు ఎక్కువ ఉన్నారని ఆయ‌న తెలిపారు.