Covid Cases: కర్ణాటకలో కోవిడ్ కలకలం.. ఒక్కరోజే 500 కేసులు!

రాష్ట్రంలో కరోనా కేసులు 500 మార్కును దాటిన తరువాత కర్ణాటక ప్రభుత్వం కఠిన రూల్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Corona Virus India

Corona Virus India

గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 500 మార్కును దాటిన తరువాత కర్ణాటక ప్రభుత్వం శనివారం నుండి కఠిన రూల్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం, ఇతర చర్యలు తీసుకునేలా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. 525 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు జరిమానా విధించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత పది రోజుల నుండి రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయమై కోవిడ్‌పై టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మాస్క్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని సిఫార్సు చేసింది. ప్రజలు కోవిడ్ రూల్స్ ను పాటించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం BBMP, జిల్లా పరిపాలనలను ఆదేశించింది.

  Last Updated: 11 Jun 2022, 11:59 AM IST