Site icon HashtagU Telugu

Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ

Delhi liquor policy

New Web Story Copy 2023 05 30t172346.195

Delhi Liquor Policy Case: ఎక్సైజ్ పాలసీ విషయంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా మనీష్ సిసోడియాపై ఈడీ అనుబంధ ఛార్జిషీటును రోస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రోస్ అవెన్యూ కోర్టు విచారించింది.

ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రోస్ అవెన్యూ కోర్టు విచారించిన అనంతరం సిసోడియాకు సమన్లు ​​పంపింది. ఈ నేపథ్యంలో సిసోడియా జూన్ 2న రూస్ అవెన్యూ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సిసోడియాతో సహా నలుగురు నిందితులకు గతంలో కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న మనీష్ సిసోడియా బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అంతకుముందు ఈడీ కేసులో అతని బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ చెప్పడంతో దానికి హైకోర్టు అంగీకరించింది.

Read More: KCR Stratagy : కేసీఆర్ కు బ్రాహ్మణుల జ‌ల‌క్‌, స‌ద‌న్ ప్రారంభ ఆహ్వాన ర‌గ‌డ