Site icon HashtagU Telugu

Tamil Nadu : పేదవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి

Couple who married against families

Couple who married against families

దేశం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న..ఇంకా మనుషుల మధ్య కుల మత విభేదాలు , పేద , ధనిక భేదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాల పట్ల కొంతమంది తండ్రులు అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ..కన్న బిడ్డ అనే ప్రేమ , కనికరం లేకుండా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు ఎన్నో వెలుగులోకి రాగా..తాజాగా తమిళనాడు (Tamil Nadu) లో ఇదే జరిగింది. పేదవాడిని కూతురు ప్రేమించిందని తట్టుకోలేక కన్న ప్రేమను పక్కను పెట్టి ఆ కూతుర్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి.

వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు తూత్తుకూడి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మారి సెల్వం (24) , కార్తిక (20) (Mari Selvam, Karthika ) లు గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండేందుకు.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయాన్ని కార్తిక తన కుటుంబ సభ్యులకు తెలపగా వారు ఒప్పుకోలేదు. సెల్వం తక్కువ కులానికి చెందినవాడని, పేదవాడిని యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న సెల్వం, కార్తిక.. మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కార్తిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

పెళ్లి అనంతరం సెల్వం, కార్తికలు మురుగేషన్ నగర్‌(Murugesan Nagar)లో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కార్తిక తండ్రి ముత్తు రామలింగం వారిని చంపేందుకు ప్లాన్ వేశాడు. గత అర్ధ రాత్రి ఐదుగురు యువకులతో సెల్వం, కార్తికలు ఉంటున్న ఇంటికి వెళ్లి దాడి చేశాడు. అందరూ కలిసి కత్తులతో యువ జంటను పొడిచి చంపేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్తిక తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేస్తూ సెల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కార్తిక తండ్రి ముత్తు రామలింగంను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఓప్పుకున్నాడు. దీంతో అతన్ని కోర్ట్ లో హాజరుపరిచారు.

 

Read Also : Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం