Site icon HashtagU Telugu

666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?

Gold Rates

666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది. ఓ ప్రైవేటు లాజిస్టిక్స్‌ కంపెనీకి చెందిన కంటెయినర్‌ బంగారు ఆభరణాలను లోడ్‌ చేసుకొని తమిళనాడులోని  కోయంబత్తూరు నుంచి సేలంకు బయలుదేరింది. ఈరోడ్‌ సమీపంలోని చిటోడే పట్టణం సమీపంలోకి వెళ్లగానే కంటెయినర్ డ్రైవర్‌ దానిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కంటెయినర్ డ్రైవర్‌ శశికుమార్‌, సెక్యూరిటీ గార్డు బాల్‌రాజ్‌ కిందపడి గాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని  సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్‌ బోల్తాపడినా.. అందులోని బంగారు ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆ బంగారం లోడ్‌కు సంబంధించిన యజమానులకు వెంటనే పోలీసులు సమాచారాన్ని అందించరు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి మరో కంటెయినర్‌ను పంపించారు. దీంతో బోల్తా పడిన వాహనంలోని ఆభరణాల పెట్టెలను అందులోకి ఎక్కించి సేలంకు తరలించారు.

Also Read :Apps Alert : దడ పుట్టిస్తున్న ‘డర్టీ స్ట్రీమ్’.. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్

గత రెండు రోజులలో బంగారం రేటు  గణనీయంగా పెరిగింది. సోమవారం రోజు తులం బంగారంపై రూ. 220 పెరగ్గా.. ఇవాళ రూ. 330 చొప్పున పెరిగింది. గత నెలలోనూ బంగారం రేట్లు బాగానే పెరిగాయి. ఈనెల ప్రారంభంలో కాస్త తగ్గిన గోల్డ్ ధర ఇప్పుడు మళ్లీ పైపైకి పోతోంది. రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 550 మేర రేటు పెరిగింది. రాబోయే రోజుల్లో గోల్డ్ ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. వెండి ధరసైతం పెరిగింది. సోమవారం కిలో వెండిపై  రూ. వెయ్యి పెరగ్గా.. ఇవాళ (మంగళవారం)సైతం కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో కిలో గోల్డ్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 90వేలకు చేరువలో ఉంది.

Also Read : Raitu Bharosa Scheme : తెలంగాణలో ‘రైతు భరోసా’ పంపిణీకి ఈసీ బ్రేక్