Site icon HashtagU Telugu

Karnataka Elections 2023: కర్ణాటక తర్వాత తెలంగాణే మా టార్గెట్: జైరాం రమేష్

Jairam Ramesh

Jairam Ramesh

Karnataka Elections 2023: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి టిపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పరిస్థితి కాస్త మారింది. కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. పాదయాత్రలతో నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

ప్రస్తుతం దేశ రాజకీయాలు కర్ణాటక వైపు చూస్తున్నాయి. మూడ్రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విశేషం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి రేవంత్ కి పిలుపు రావడం ఆసక్తి పెంచింది. కర్ణాటకలో సీఎం కుర్చీ దక్కించుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయితే కర్ణాటకలో బీజేపీకి 130 సీట్లు ఖాయంగా ప్రచారం చేసుకుంటున్నారు సీనియర్ నేతలు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ స్పష్టంగా ఉందన్నారు జైరాం. తెలంగాణ నేతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ చేతుల్లోకి తీసుకుని ముందుకు నడిపిస్తుందన్నారు. దేశంలో మోడీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తామని జైరాం స్పష్టం చేశారు. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు.

పార్టీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు జైరాం రమేష్. తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవసరం రాబోదని అన్నారు.

Read More: king charles kohinoor : కోహినూర్‌ ను కింగ్ చార్లెస్ ఇండియాకు ఇచ్చేస్తారా?