Site icon HashtagU Telugu

బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా

Template 2021 12 31t123417

Template 2021 12 31t123417

సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 437 వార్డుల్లో విజయం సాధించింది. జేడీఎస్ 45, స్వతంత్రులు 204 చోట్ల గెలిచారు.

58 గ్రామ పంచాయితీలకు, 9 పట్టణ స్థానిక మండళ్లకు బైపోల్స్ నిర్వహించగా.. వీటి ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బీజేపీ 36.9 శాతం, జేడీఎస్ 3.8 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులకు 17.2 శాతం ఓట్లు లభించాయి.

బీజేపీ కంచుకోటలైన విజయ్ పుర, బెళగావి, చిక్కమగుళూరు జిల్లాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటింది. విజయ్ పుర జిల్లాలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్ మూడింటిని గెలుచుకుంది.బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ్ నియోజకవర్గం పరిధిలోని బంకపుర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.