Site icon HashtagU Telugu

AK Antony Vs Anil Antony : నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి : కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ

Ak Antony Vs Anil Antony

Ak Antony Vs Anil Antony

AK Antony Vs Anil Antony : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున  పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ ఆంటోనీ‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేరళలోని పతనంతిట్ట లోక్ సభ స్థానంలో  తన కుమారుడు అనిల్ ఆంటోనీ‌ని ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడం తప్పు అని ఏకే ఆంటోనీ(AK Antony Vs Anil Antony) కామెంట్ చేశారు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘నా మతం కాంగ్రెస్ పార్టీ. దానికే సదా నా మద్దతు ఉంటుంది. తుదిశ్వాస దాకా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఏకే ఆంటోనీ తెలిపారు.  ‘‘కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ జాతీయ సమస్యలపైనే పోరాటం చేస్తుంటారు. ఇండియా కూటమి ప్రతిరోజూ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పతనం ఖాయం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు మంచి అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు.

Also Read :Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?

అనిల్ ఆంటోనీ బీజేపీలో ఎందుకు చేరారు ?

Also Read : Stock Market 75000 : స్టాక్ మార్కెట్ రయ్ రయ్.. తొలిసారిగా 75000 దాటిన సెన్సెక్స్