Site icon HashtagU Telugu

Bengaluru: దేవుళ్లను అగౌరవపరుస్తోందంటూ…అమెజాన్ పై ఫిర్యాదు..!!

Amazon

Amazon

బాయ్ కాట్ అమెజాన్….ఇప్పుడు ట్విట్టర్లో బాగా ట్రెండింగ్ అవుతోంది. రాధాకృష్ణుడి అభ్యంతరకర రీతిలోఉన్న ఫొటోలను అమోజాన్ తన ఫ్లాట్ ఫాంపై విక్రయిస్తోందంటూ…హిందూ జనజాగృతి సమితి ఆరోపిస్తోంది. అమెజాన్ తోపాటుగా…ఆ పోర్టల్ ఉన్న ఫొటోలను విక్రయానికి పెట్టిన సంస్థ ఎక్సోటిక్ ఇండియాపైనా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ సంస్థ బెంగళూరు సబ్రమణ్య నగర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు ఎక్సోటిక్ ఇండియా వెబ్ సైట్లోనూ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 18,19 తేదీలో దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. వివాదం మొదలైన తర్వాత సంబంధిత వెబ్ సైట్ల నుంచి ఈ ఫొటోలను తొలగించారని తెలిపింది.

అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా భేషరతుగా క్షమాపణలు కోరాలి…ఎప్పుడూ హిందువుల మనోభావాలను గాయపర్చమంటూ భరోసా ఇవ్వాలి. విలువల్లేని అమెజాన్ తరుచుగా జాతీయ, ప్రాంతీయ మత చిహ్నాలను, దేవుళ్లను కించపరుస్తోంది. అమెజాన్ ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడకుండా భారత్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ జనజాగృతి సంస్థ కోరింది.