స్టాలిన్ సారూ.. యూ ఆర్ గ్రేటూ..!

డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఆయన పాలన సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన తరచుగా పేదలను కలుస్తూ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:37 PM IST

డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఆయన పాలన సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన తరచుగా పేదలను కలుస్తూ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్ తొక్కుతూ.. మార్నింగ్ వాక్ చేస్తూ తాను కూడా మీల్లాంటివాడినే అనే భరోసా కల్పిస్తున్నారు. ఒకవైపు తాను పనిచేస్తూనే.. మరోవైపు మంత్రులు చురుగ్గా పనిచేసేలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారికి సాయం చేసి మరోసారి వార్తలోకి ఎక్కారు. సెల్లాం జిల్లా అరసిపాలయానికి చెందిన 13 ఏళ్ల జనని మూత్రపిండాల వ్యాధితో చెన్నై లో చికిత్స పొందుతుంది.  తల్లిదండ్రులు తమ కూతుర్ని కాపాడమని.. సీఎం స్టాలిన్ కోరుతూ.. సోషల్ మీడియా  వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు.  చిన్నారి జనని వీడియోలకు స్పందించిన సీఎం స్టాలిన్ స్వయంగా చెన్నై లోని స్టాన్లీ హాస్పిటల్ కి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. తల్లిదండ్రులకు దైర్యం చెప్పారు. చిన్నారికి మెరుగయిన వైద్య చికిత్స అందించాలని..  వైద్యులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైద్యానికి అవసరమైన ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

అయితే  స్టాలిన్ జనరంజక పాలన చేస్తుండటంతో ప్రతిపక్ష నేతలు సైతం ఆయన్ను మెచ్చుకుంటున్నాయి. అసెంబ్లీ సాక్షిగా తమిళనాడు మంత్రులు స్టాలిన్ ను పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Mk Stalin)ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆయన తీసుకునే వినూత్న నిర్ణయాలతో ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్నా. తనకు పొగడ్తలు సరిపడవంటున్నారు. సభా సమయంలో అదే పనిగా తనను పొగుడుతూ ప్రసంగం కొనసాగిస్తున్న సొంతపార్టీ నేతలకు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చిన వార్తలు కూడా చర్చనీయాంశంగా మారాయి.