Tamil Nadu Autonomous : గతంలో మన దేశంలో జమ్మూకశ్మీరుకు స్వయం ప్రతిపత్తి ఉండేది. అయితే దాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసింది. ప్రస్తుతం మనదేశంలో ఏ రాష్ట్రానికీ స్వయం ప్రతిపత్తి లేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు తమ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. నిధుల కోసం నిలదీస్తున్న రాష్ట్రాలనే పట్టించుకోని మోడీ సర్కారు, స్వయం ప్రతిపత్తి కోసం గొంతు చించుకుంటున్న స్టాలిన్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా ? హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌కే వెళ్లని ప్రధాని మోడీ.. స్వయం ప్రతిపత్తి డిమాండ్‌తో ముందుకొచ్చిన స్టాలిన్‌ను సీరియస్‌గా తీసుకుంటారా ? అనే కోణంలో ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తోంది.
Also Read :TPCC Protest : కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులు : భట్టి
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
స్వయం ప్రతిపత్తి డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన తమిళనాడులోని డీఎంకే(Tamil Nadu Autonomous) సర్కారు ఆ దిశగా కీలక అడుగులు వేసింది. దీనిపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని సీఎం స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అశోక్ వర్ధన్ శెట్టి, ఎం.నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. తమిళనాడు శాసనసభలో 110వ నిబంధన కింద దీనిపై సీఎం ప్రకటన చేశారు.
Also Read :Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక
కమిటీ నివేదిక వచ్చాక.. ఏం జరుగుతుంది ?
జోసెఫ్ కురియన్ కమిటీ.. 1971లో జస్టిస్ రాజమన్నార్ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. 2026 జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పించనుంది. రెండేళ్లలో సమగ్ర నివేదికను అందించనుంది. ఈ నివేదిక వచ్చాక ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే సంవత్సరమే(2026లో) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం అన్నా డీఎంకేను ఇరుకున పెట్టేందుకే ఈ వ్యవహారాన్ని సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. స్థానిక సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యే తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం ఖాయం.