Site icon HashtagU Telugu

Child Marriages : మైసూరులో పెరుగుతున్న బాల్య వివాహాలు…?

Child Marriages

Child Marriages

మైసూర్ లో బాల్య వివాహాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబ‌ర్ మధ్య మైసూర్ లో 180కి పైగా బాల్య వివాహాల మీద ఫిర్యాదులు అందాయి. ఇది ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికంగా ఉంది. ఏప్రిల్ 2020, మార్చి 2021 మ‌ధ్య‌కాలంలో 301 బాల్య వివాహాలపై ఫిర్యాదులు అందాయి. గ‌త ఏడాది బాల్య‌వివాహాల్లో రాష్ట్రంలోనే రెండ‌వ స్థానంలో మైసూర్ నిలిచింది. ఈ గణాంకాలు చైల్డ్‌లైన్ 1098కి వచ్చిన ఫిర్యాదుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. గతేడాది 374 కేసులతో బళ్లారి అగ్రస్థానంలో ఉంది.

Also Read : ఆంధ్రా, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో క‌ర్నాట‌క ఆంక్ష‌లు

క‌రోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ బాల్య వివాహాల‌పై అవగాహన కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నామ‌ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఉప సంచాలకులు బసవరాజు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలపై బాల్య వివాహాల ప్రతికూల ప్రభావం గురించి పాఠశాలలు, అంగవాడీ కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా వాహనాలకు లౌడ్‌స్పీకర్‌ని ఉపయోగించి ప్రకటనలు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.అయితే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.బాల్య వివాహాలు చేసే త‌ల్లిదండ్రుల‌పై కేసులు న‌మోదు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Also Read : Corona 3rd Wave : సీఎంలూ…బ‌హుప‌రాక్.!

క‌రోనా సెకండ్‌ వేవ్ సమయంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో అధికారులు వీటిపై ప‌ర్య‌వేక్ష‌ణ పెట్ట‌ర‌నే భావ‌న‌తో చాలా మంది త‌ల్లిదండ్రులు వివాహాల‌పై దృష్టి సారించార‌ని అధికారులు అంటున్నారు. చాలా సందర్భాలలో క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా ఉన్న‌ సమయంలో వివాహానికి హాజరయ్యే వ్యక్తుల సంఖ్యపై ఉన్న ఆంక్షలు, ఖర్చు తగ్గుతుందని తల్లిదండ్రులు హడావిడిగా పెళ్లిళ్లు చేస్తున్నార‌ని అధికారులు తెలిపారు. మైసూరు నగరంలో బాల్య‌వివాహాలు అరుదుగా జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జిల్లా అంతటా కేసులు ఉన్నాయి. అయితే, సామాజిక-ఆర్థిక పరిస్థితులతో పాటు సాపేక్షంగా ఒంటరిగా ఉన్న కారణంగా కొడగు సరిహద్దులో ఉన్న పెరియపట్న నుండి అధిక సంఖ్యలో కేసులు ఉన్నాయి.

Exit mobile version