CJI: ‘అబ్బాయ్ ర‌మ‌ణ’ అనే ప‌ల‌క‌రింపు పుల‌క‌రింపజేసింది!

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఎన్వీర‌మ‌ణ భాద్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారిగా ఆయ‌న త‌న సొంత ఊరి ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది.

  • Written By:
  • Updated On - December 28, 2021 / 11:45 AM IST

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఎన్వీర‌మ‌ణ భాద్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారిగా ఆయ‌న త‌న సొంత ఊరి ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు వంద‌నం అభివంద‌నం అంటూ ప‌ర్య‌ట‌న గురించి లేఖ రాశారు. ఎప్ప‌టి నుంచో పొన్న‌వ‌రం ఒక‌సారి వెళ్లి అయిన‌వాళ్లంద‌రినీ క‌లిసి ప‌ల‌క‌రించి రావాల‌ని అనుకున్నాన‌ని..శీతాకాల సెలవుల‌తో త‌న ప‌ర్య‌ట‌న ఏర్పాటు చేసుకున్న‌ట్లు ఆయ‌న లేఖ‌లో ప్ర‌స్తావ‌వించారు.

త‌న స్వ‌గ్రామానికి ఈ నెల 24 వ‌తేదీన బ‌య‌లుదేరి ఏపీలో అడుగుపెట్ట‌గానే ఆంధ్రా ప్ర‌జ‌లు అసంఖ్యాకంగా బారులు తీరి స్వాగ‌త వ‌చ‌నాలు, నినాదాలు, పూల‌వాన‌తో ప్రేమాభిమానాల‌తో ముంచెత్తిన తీరు త‌న కుటుంబ స‌భ్యులు ఎప్ప‌టికి మ‌రిచిపోలేనిద‌న్నారు. బంధుత్వాల‌కంటే మిత్ర‌బంధానికే పెద్ద పీట వేసే పొన్న‌వ‌రం ఊరు ఊరంతా త‌ర‌లివ‌చ్చి త‌న‌కు అపూర్వ‌సాగ‌త్వం ప‌లికిన తీరు చాలాబాగుంద‌ని జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. అబ్బాయ్ ర‌మ‌ణ అంటూ ఊళ్లో పెద్ద‌లు ప‌ల‌క‌రించిన వైనం త‌న‌ను పుల‌క‌రింప‌జేసింద‌ని.. అన్ని గౌర‌వార్థ‌ల‌కంటే ఆ ఆశీర్వ‌చ‌నాల భ‌రిత ప‌ల‌కరింపు ముందు దిగ‌దుడుపేన‌ని తెలిపారు. త‌న‌కు ఆతిధ్య‌మిచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.స‌మ‌యాభావం వ‌ల్ల ఎంద‌రినో క‌ల‌వ‌డం కుద‌ర‌లేద‌ని మ‌రోసారి అంద‌రిని క‌లిసే అవ‌కాశం త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని…తెలుగు ప్ర‌జ‌ల ఆశీర్వ‌ద బ‌ల‌మే త‌న‌ని ఈ స్థాయికి చేర్చింద‌ని సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.