Act of Duty: వ‌ర‌దల్లో లేడీ ఇన్పెక్ట‌ర్ రెస్య్కూ ఆప‌రేష‌న్ శ‌భాష్ అనాల్సిందే…!

చెన్నై న‌గ‌రం ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు,వరదల‌కు అతలాకుతలం అవుతోంది

  • Written By:
  • Publish Date - November 14, 2021 / 12:38 AM IST

చెన్నై న‌గ‌రం ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు,వరదల‌కు అతలాకుతలం అవుతోంది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని కాపాడతూ రెస్య్కూ ఆప‌రేష‌న్ చేసిన మ‌హిళా పోలీస్ అధికారి రాజేశ్వ‌రి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. చెన్నైలోని టిపి చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న ఉదయ అనే వ్యక్తిని ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి తన భుజాలపై ఎక్కించుకుని ఆసుపత్రికి పంపేందుకు ఆటో కోసం వెతుకుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

దీనిపై ఇన్పెక్ట‌ర్ రాజేశ్వ‌రి స్పందించారు. తాను ఆ వ్య‌క్తికి ప్రథ‌మ చికిత్స చేసి ఆటోలో ఎక్కించ‌డం కోసం తీసుకెళ్లాన‌ని ఆమె తెలిపారు. ఆటోలో ఆసుప‌త్రికి త‌ర‌లించాన‌ని..ఆసుప‌త్రి వ‌ద్ద ఉన్న ఆయ‌న త‌ల్లికి భ‌రోసాని క‌ల్పించాన‌ని తెలిపారు. ఆ వ్య‌క్తికి చికిత్స కొన‌సాగుతుంద‌ని..ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు తెలిపారు. అయితే లేడీ ఇన్పెక్ట‌ర్ రెస్య్కూ ఆప‌రేష‌న్స్ వైర‌ల్ అవ్వ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆమెకు ప్ర‌సంస‌ల జ‌ల్లు కురిసింది.

ట్విట్ట‌ర్‌లో ప‌లువురు ప్ర‌ముఖులు ఆమె రెస్క్యూ చేసిన వీడియోని పోస్ట్ చేస్తూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి తన శక్తికి మరియు వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి ఆమె చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు.