Chennai Rains:చెన్నెలో మళ్ళీ భారీ వర్షాలు… అధికారుల యాక్షన్ ప్లాన్ రెడీ

వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నైలో రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 11:18 PM IST

వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నైలో రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, రాణీపేట జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ, రెడ్ అలర్ట్ ప్రకటించింది. వెల్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచి, విల్లుపురం, మయిలదుత్తురాయ్, డెల్టా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది.

గతవారపు వరద అనుభావాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి పగడ్బంది ఏర్పాట్లను చేసింది. వరదతో మునిగిపోయిన ప్రాంతాల్లోకి వెళ్ళడానికి 50 బోట్లు, వరదనీటిని తోడడానికి 689 మోటార్ పంపులను సిద్ధం చేశారట.

Also Read: క్రెడిట్ కార్డు కావాలా అంటూ, మూడు కోట్లు దోచుకున్నారు

మొన్నటి వరదలకు వచ్చిన 5700 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలను తొలగించామని, దాంతో ఈసారి వర్షం నీరు రోడ్లపై ఆగకుండా డ్రెయినేజీ నుండి వరద నీరు వెళ్ళిపోతుందని అధికారులు తెలిపారు. వర్షసూచన ఉన్న నేపథ్యంలో నగరంలోని కల్వర్టులు, డ్రెయినేజీలు పరీక్షించామని ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.