Site icon HashtagU Telugu

Omicron: ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

Template (31) Copy

Template (31) Copy

దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. ఒమిక్రాన్ కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. వెంటనే వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవాలని, కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. డెల్టా కంటే ఒమిక్రాన్ మూడురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.

 

Exit mobile version