Site icon HashtagU Telugu

CBI : గాలి జనార్దన్ రెడ్డికి షాకిచ్చిన సీబీఐ..!!

Gali

Gali

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. CBIనమోదు చేసిన ఈ కేసులో చాలాకాలం పాటు జైల్లో ఉన్న జనార్థన్ రెడ్డి..సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిలపై విడుదలయ్యారు. ప్రస్తుతం తన సొంతూరు అయిన బళ్లారిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన బెయిర్ రద్దు చేయాలని కోరుతూ CBIగురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ లో CBIఅధికారులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించిన సీబీఐ…కేసును పక్కదోవ పట్టిస్తున్నారని కోర్టుకు తెలిపింది. డిశ్చార్జీ పిటిషన్లు దాఖలు చేస్తున్న నిందితులు..కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. బళ్లారి నుంచి ఆయన్ను బయటకు పంపించాలని కూడా సుప్రీంకోర్టును సీబీఐ అధికారులు కోరారు.

 

Exit mobile version