Maharashtra Crisis : రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా `మ‌హా` పాలి`ట్రిక్స్`

రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎనిమిది మంది మంత్రుల‌పై శివ‌సేన వేటు వేసింది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 03:30 PM IST

రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎనిమిది మంది మంత్రుల‌పై శివ‌సేన వేటు వేసింది. ప‌రిపాల‌నకు దూరంగా ఉన్నార‌న్న కార‌ణంతో సీఎం ఉద్ద‌వ్ థాక్రే ఎనిమిది మంది మంత్రుల‌ను తొల‌గించారు. ప్ర‌స్తుతం షిండే అండ్ టీం గుహ‌వాటి క్యాంపులో ఉన్నారు. ఇంకో వైపు అజ‌య్ చౌద‌రిని ఫ్లోర్ లీడ‌ర్ గా గుర్తిస్తూ డిప్యూటీ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయం రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా న‌డుస్తోంది. రెబ‌ల్ ఏక్ నాథ్ షిండే బదులుగా అజ‌య్ చౌదరి శివ‌సేన ప్లోర్ లీడ‌ర్ గా గుర్తిస్తూ డిప్యూటీ స్పీక‌ర్ ప్ర‌క‌టించ‌డంతో ఆ రాష్ట్ర రాజ‌కీయం వేగంగా మ‌లుపుతు తిరుగుతోంది. ప్ర‌స్తుతం ఏక్ నాథ్ షిండే ముందు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఏదో ఒక పార్టీలో విలీనం కావ‌డం ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. లేదంటే అన‌ర్హ‌త వేటు సిద్ద‌ప‌డ‌డం రెండో ఆప‌ర్ష‌న్ కింద క‌నిపిస్తోంది. ఆ క్ర‌మంలో మ‌హారాష్ట్ర రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా వెళుతుందా? అనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

విశ్వాస తీర్మానానికి ప్ర‌భుత్వం సిద్ధం కావ‌డానికి అవ‌కాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడ‌ర్‌గా అజ‌య్ చౌద‌రికి అధికారిక గుర్తింపు రావ‌డంతో విశ్వాస ప‌రీక్ష దిశ‌గా శివ‌సేన పావులు క‌దుపుతోంది. ప్ర‌స్తుతం షిండే వ‌ద్ద ఎమ్మెల్యేలు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ శివ‌సేన పార్టీకి చెందిన వాళ్లే. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీలోనూ విలీనం కాక‌పోవ‌డంతో ఆయ‌న వ‌ద్ద ఉన్న రెబ‌ల్స్ మీద అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే, ప్రభుత్వాన్ని బీజేపీ కూడా ఏర్పాటు చేయ‌లేదు. అది పెద్ద పార్టీలుగా కాంగ్రెస్, శివ‌సేన ఉన్న‌ప్ప‌టికీ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం లేదు. ఫ‌లితంగా రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా అడుగులు ప‌డేందుకు ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది.

ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర రాజ‌కీయ వ్య‌వ‌హారం సుప్రీం కోర్టులోనూ న‌డుస్తోంది. కోర్టు ఇచ్చే డైరెక్ష‌న్ ప్ర‌కారం న‌డుచువాల్సి ఉంటుంది. అయితే, అసెంబ్లీలో స్పీక‌ర్ లేదా డిప్యూటీ స్పీక‌ర్ కు ఉండే అధికారాల‌పై న్యాయ‌స్థానాలు జోక్యం చేసుకోవు. ఆక్ర‌మంలో స్పీక‌ర్ కు ఉండే విశిష్టాధికారం ఉప‌యోగిస్తే రెబ‌ల్స్ పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. అప్పుడు ఎవ‌రూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ గేమ్ ప్లాన్ ఎంటి? అనేదానిపై మ‌హా స‌ర్కార్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. షిండే కొత్త పార్టీని మూడు రోజుల క్రితం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆ పార్టీకి అసెంబ్లీలో గుర్తింపు ఇవ్వాలంటే స్పీక‌ర్ అనుమ‌తించాలి. ఇలాంటి చిక్కుముడుల మ‌ధ్య రోజుకో మ‌లుపుతిరుగుతోన్న రాజ‌కీయాన్ని మ‌రింత హీటెక్కించేలా ఈడీ రంగంలోకి దిగడం గ‌మనార్హం.

ముంబై ‘చాల్’ రీ-డెవలప్‌మెంట్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను మ‌రోసారి విచారణకు పిలిచింది. జూన్ 28న దక్షిణ ముంబైలోని కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అతని స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. దాని అనుసంధానంగా మ‌రోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. శివసేన పార్టీ రెబ‌ల్ ఎమ్మెల్యేల బృందంతో పోరాడుతుండగా ఈ పరిణామం ప్రశ్నార్థకంగా మారింది. విచారణలో భాగంగా రౌత్ భార్య వర్షా రౌత్ , అతని ఇద్దరు సహచరులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏప్రిల్‌లో ED తాత్కాలికంగా అటాచ్ చేసింది.

“ED, CBI ఇతర కేంద్ర ఏజెన్సీల ఒత్తిడి” ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబ‌ల్స్ తిరుగుబాటుకు కార‌ణ‌మ‌ని థాక‌రే విశ్వ‌సిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెబ‌ల్‌ ఎమ్మెల్యేలకు భద్రత రూపంలో చర్చలు జ‌రుపుతోందని శివ‌సేన ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈడీని కూడా కేంద్రం ఇప్పుడు రంగంలోకి దించింద‌ని అనుమానిస్తోంది. ఇటీవలే డెక్కన్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా గాంధీలను కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఇప్పుడు మ‌హారాష్ట్ర రాజ‌కీయం కూడా ఈడీ, సీబీఐల ఒత్తిడికి అనుగుణంగా న‌డుస్తుంద‌ని శివ‌సేన భావిస్తోంది.