Mosque like Bus stand: మసీదు డిజైన్ లో బస్టాప్..బీజేపీ ఎంపీ హెచ్చరికతో రూపు మారింది..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 03:19 PM IST

కర్నాటకలోని మైసూరులో మసీదును పోలిన బస్ స్టాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ హెచ్చరించడంతో…ఆ బస్టాండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ రహదారి 766లోని కేరళ బోర్డర్ కొల్లేగల సెక్షన్ లోని బస్టాప్ లో ఇప్పుడు ఎరుపు రంగులో ఉన్న ఒక గోపురం మాత్రమే కనిపిస్తుది. గతంలో ఉన్న రెండు చిన్న గోపురాలు ఇప్పుడు లేవు.

విషయం ఏంటంటే..కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మసీదు లాంటి బస్టాప్ ను నిర్మించారు. దాన్ని చూసిన ఎంపీ వెంటనే దాన్ని కూల్చివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ వార్నింగ్ ఇవ్వడంతో తీవ్ర వివాదస్పదమైంది. బస్టాండ్ ఫొటోను ఈమధ్య సోషల్ మీడియాలో చూశానని అన్నారు. ఈ బస్టాండ్ అధికారులు వెంటనే కూల్చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు.

ఈ బస్టాప్ ను బీజేపీ ఎమ్మెల్యే రామ్ దాస్ కట్టించారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ…మైసూర్ ప్యాలెస్ ను స్పూర్తిగా తీసుకుని ఈ బస్టాప్ ను డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. కేవలం మైసూరు వారసత్వాన్ని పరిగణలోనికి తీసుకునినిర్మించినట్లు వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను గాయపడినా దానికి తాను క్షమాపణ చెప్పుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో మసీదును పోలీసు బస్టాండ్ ను రీ డిజైన్ చేశారు. బస్టాండ్ రీడిజైన్ కు సంబంధించిన ఫొటోలను ఎంపీ సిన్హా అందరికీ షేర్ చేశారు.