Site icon HashtagU Telugu

BRS MLA: అరెస్ట్ చేయించినా తలొగ్గను.. రోహిత్ రెడ్డి కామెంట్స్

Rohith Reddy BRS MLA

Rohith Reddy Imresizer

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అదే సమయంలో రంగంలోకి దిగిన ఈడీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విచారణ పేరుతో పిలిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇటు గులాబీ పార్టీ , అటు కాషాట పార్టీ ఎవరికి వారే విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కొత్త కుట్రను బయటపెడతామంటున్నారు. ఈడీ విచారణకు సంబంధించి మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టినందుకే బీజేపీ తనను టార్గెట్ చేసిందన్నారు. ఈడీ పేరుతో భయపెట్టాలని చూస్తోందని, తాను మాత్రం తగ్గేదే లే అంటూ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేయించినా సరే బీజేపీకి తలొగ్గని చెప్పారు.

బీజేపీ తీరు.. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని రోహిత్ రెడ్డి విమర్శించారు. తనకు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈడీ నోటీసులపై సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. డిసెంబర్ 27న ఈడీ విచారణకు మరోసారి హాజరవుతానని రోహిత్ రెడ్డి వెల్లడించారు. ఈడీ విచారణకు హాజరైనప్పటి నుంచి రోహిత్ రెడ్డి తనను ఏ కేసులో విచారిస్తున్నారో చెప్పలేదంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఎన్నికల అఫిడవిట్ , తన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అడిగారన్నారు. నిజానికి మనీలాండరింగ్ వ్యవహారంలోనే ఈడీ విచారణ జరుపుతుందని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎక్కడా మనీలాండరింగ్ లేకపోయినా తనను విచారించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఏ కేసులో అయినా దర్యాప్తు అధికారులు నిందితులని విచారిస్తారని, ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరుగుతోందన్నారు. తనను, అభిషేక్ ను విచారించినా వారికి ఏ సమాచారం దొరకలేదని.. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నంద కుమార్ ని విచారిస్తామని కోర్టులో అప్పీల్ దాఖలు చేశారని రోహిత్ రెడ్్డి చెప్పారు. నందకుమార్ ద్వారా వారికి నచ్చినట్లు వాంగూల్మం తీసుకొని… తనని ఈ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందనే సమాచారం తమ వద్ద ఉందనన్నారు. బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పోరాటంలో వెనక్కి తగ్గనని చెప్పారు. ఇది కేవలం బీఆర్ఎస్ సమస్య కాదని.. తెలంగాణ ప్రజల సమస్య అన్న విషయాన్ని ప్రజలు గమనించాసని కోరారు. బీజేపీ కొత్త కుట్రపై కోర్టులోనే తేల్చుకుంటానని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Exit mobile version